వలసల నివారణకు కృషి

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : కనిగిరి నియోజకవర్గ ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళుతున్నారని, ఆ వలసల నివారణకు ప్రత్యేక కషి చేస్తానని టిడిపి కనిగిరి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి తెలిపారు. చెన్నైలో నివాసముంటున్న కనిగిరి నియోజకవర్గ ప్రజలతో ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ కనిగిరి ప్రాంతంలో అందరికీ ఉపాధి లభించాలంటే పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. పరిశ్రమలు ఏర్పాటు కావాలంటే టిడిపి అధికారం లోకి రావాలన్నారు. కనిగిరి నియోజకవర్గంలో ట్రిపుల్‌ ఐటి, నిమ్జ్‌, రైల్వేలైన్‌ ఏర్పాటుకు కృషి చేసి వలసల నివారణకు పాటుపడతానని తెలిపారు. రాష్ట్రంలో రాక్షసు పాలన సాగుతుందని ఆ పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాల ద్వారా పేదల అభివద్ధికి బాటలు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాగుంట రాఘవరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు నగేశ్వరరావు, ఆరు మండలాల టిడిపి అధ్యక్షులు, జనసేన, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️