ఎన్నికల విధులను బాధ్యతతో నిర్వర్తించాలి

ప్రజాశక్తి-రాయచోటి ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఎన్నికల సమర్థవంత నిర్వహణపై జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్‌ కిషోర్‌ నోడల్‌ అధికారులకు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మే13వ తేదీ జరిగే సాధారణ ఎన్నికల పోలింగ్‌ సంబంధించి నోడల్‌ అధికారులు సమన్వయంతో పనిచేసి పోలింగ్‌ సరళి విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో పోలింగ్‌ కేంద్రాల వివరాలు ఓటర్ల సంఖ్య తదితర సమాచారం ఎన్నిక అబ్జర్వర్లకు ఇవ్వాలన్నారు. ఈ ఎన్నికలలో ఎటువంటి సమస్యలు తలెత్తిన సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని అన్నారు.ముఖ్యంగా కో-ఆర్డినేషన్‌ సెక్షన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సెక్షన్‌ చాలా అలర్ట్‌గా ఉండాలి అన్నారు. జిల్లాలో ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ పెండింగ్‌ లేకుండా చూడాలన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి పోస్టల్‌ బ్యాలెట్లు ఇవ్వాలని ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వెంటనే వారికి అందజేయాలని సూచించారు. హోమ్‌ ఓటింగ్‌ కార్యక్రమంలో ఎటువంటి సమ స్యలు లేకుండా కేటాయించిన అధికారులు బాధ్యతతో పనిచే యాలన్నారు. ఇవిఎం స్ట్రాంగ్‌ రూముల దగ్గర విద్యుత్‌ సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇవిఎంలు తరలించే వాహనాలకు జిపిఎస్‌ సిస్టం తప్పకుండా ఉండేటట్లు చూడాలన్నారు. ఈనెల11న సాయంత్రం 6 గంటల నుంచి ఎన్నికల ప్రచారం ముగుస్తుందని,తర్వాత ఎటువంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ దష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎంసిసి నిబంధనలు తప్పక పాటించాలన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన అన్ని చెక్‌ పోస్టు వద్ద సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహించి ప్రతి వాహన్నాని క్షుణంగా పరిశీలించాలన్నారు. వాహనాలు తనిఖీ చేసే సమ యంలో తప్పని సరిగా వీడియో కవరేజ్‌ చేసి డబ్బు, మద్యం ఇతర ఆర్టికల్స్‌ సీజ్‌ చేసిన తరువాత వాటిని సంబందిత పోలీస్‌ స్టేషన్‌లో అందజేసి, వాహన దారులకు రసీదు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఒ సత్యనా రాయణ, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️