ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి : ఎన్నికల అబ్జర్వర్‌ రమేష్‌ భారతి ఆదేశాలు

ప్రజాశక్తి -పులివెందుల రూరల్‌ (కడప) : మే 13న జరగనున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనలకు లోబడి అందరూ పనిచేసి ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఎంపీ ఎన్నికల అబ్జర్వర్‌ రమేష్‌ భారతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన పులివెందులకు విచ్చేశారు. పులివెందుల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటేష్‌, పలువురు అధికారులతో ఆయన ఆర్డిఓ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంట్‌ ఎన్నికల ఏర్పాట్లపై తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని, ఎక్కడ కూడా ప్రలోభాలు లేకుండా చూడాలని, ఒకవేళ ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే రాష్ట్ర ఎన్నికల అధికారికి నివేదించాలన్నారు. ఎన్నికలలో ఎన్నికలలో నిబంధన మేరకు నడుచుకోవాలని ఎవరైనా ఎన్నికల నియమ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల అసెంబ్లీ నియోజవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటేశు, అధికారులు ఉన్నారు.

➡️