‘అమ్మ’ ను చిత్రించిన చిన్నారులు

May 26,2024 10:05 #Sneha

సృష్టిలో అమ్మ ప్రేమ ఎంతో మధురమైనది. ఆ అమ్మ ప్రేమ పిల్లలకు వివిధ రకాలుగా కనిపిస్తుంది. తమపై అమ్మ చూపిన ప్రేమనే చిన్నారులు రకరకాల రూపాల్లో చిత్రాల ద్వారా కళ్లకు కట్టారు. ఫోరం ఫర్‌ ఆర్టిస్ట్స్‌ స్టూడెంట్స్‌ వింగ్‌ ఆధ్వర్యంలో గరిమెళ్ళ నానయ్య చౌదరి సహకారంతో 1 నుంచి 10వ తరగతి చిన్నారులకు మే 19వ తేదీన చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. విజయవాడ భవానీపురం సితార సెంటర్లోని సమ్మర్‌ స్పెషల్‌ ఎగ్జిబిషన్‌-2024లో ‘సృష్టిలో అమ్మ ప్రేమ’ అనే అంశంపై నిర్వహించిన గరిమెళ్ల సుబ్బారావు స్మారక చిత్రలేఖనం పోటీలకు విశేష స్పందన లభించింది. విజయవాడ నగరం నలుమూలల నుంచి 200 మందికిపైగా చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. తమ చిట్టిచిట్టి చేతులతో అమ్మ ప్రేమని కళ్లకు కట్టినట్లుగా చిత్రించి, ఆహుతులను అలరించారు.

➡️