అంగన్‌వాడీల సమ్మె ఉధృతం

తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారంతో నాలుగోరోజుకు చేరుకుంది. పలుచోట్ల అంగన్‌వాడీలు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. పలుచోట్ల వంటావార్పు, భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ర్యాలీగా వెళ్లి తహశీల్దార్‌, ఎంపిడిఒలకు వినతిపత్రాలు అందించారు. అంగన్‌వాడీలకు సిపిఎం, టిడిపి, జనసేన పార్టీలు మద్దతు తెలిపాయి.
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
కలెక్టర్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మె శిబిరాన్ని సిఐటియు నగర అధ్యక్షులు బి.జగన్నాథరావు శుక్రవారం సందర్శించారు. అంగన్వాడీలు నల్ల చీరలతో ఒంటి కాలిపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జగన్నాధరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు దుర్గాభవాని, కార్యదర్శి టి.రజిని, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి వి.సాయిబాబు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాజనాల రామ్మోహన్‌రావు మద్దతు తెలిపారు. ద్వారకాతిరుమల :తహశీల్దార్‌ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తున్న అంగన్‌వాడీ టీచర్లను, కార్యకర్తలను జనసేన గోపాలపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి సువర్ణరాజు కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండలాధ్యక్షులు మూర్తి, నాయకులు శేఖర్‌, పవన్‌, తులసి, సాయి, ప్రకాష్‌, చిలుకూరి నరేష్‌, శ్రీనివాసరావు, రాజేష్‌, సత్తిబాబు, అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు మధ్యాహ్నపు అనంతలక్ష్మి, కె.నాగలక్ష్మి, డి.తులసి, కె.సుధ, కె.హేమలత పాల్గొన్నారు.బుట్టాయగూడెం : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మెలో నాలుగో రోజు శుక్రవారం తహశీల్దార్‌ కార్యాలయం నుంచి ఎంపిడిఒ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇఒపిఆర్‌డి శ్రీహరికి వినతిపత్రం అందించారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట మోకాళ్లపై నిలబడి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కృపమణి, పుష్ప, రామలక్ష్మి, మరమ్మ, భూదేవి, రమ యమ్మ, నూర్జహాన్‌, మున్ని, పార్వతి, నిర్మల పాల్గొన్నారు.చింతలపూడి : అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలకొడితే బ్యాలెట్‌ బాక్సులు బద్దలుకొడతామని అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు సరోజిని హెచ్చరించారు. చింతలపూడిలో అంగన్‌వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జెఎసి ఆధ్వర్యంలో చెవిలో పువ్వు, నల్లటి వస్త్రాలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్‌ఐ కాంతమ్మకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌విఎస్‌.నారాయణ, మండలాధ్యక్షులు నత్తా వెంకటేశ్వరరావు, ఎఐటియుసి నాయకులు పాల్గొన్నారు. అంగన్‌వాడీల సమ్మెకు టిడిపి నియోజకవర్గ యువ నాయకురాలు లీలా ప్రశాంతి, టిడిపి నియోజకవర్గ మాజీ కన్వీనర్‌ ముత్తారెడ్డి, జనసేన మండల అధ్యక్షులు చీదారాల మధుబాబు మద్దతు తెలిపారు. చాట్రాయి : చాట్రాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నల్ల చీరలు ధరించి నిరసన తెలిపారు. సిఐటియు మండల నాయకురాలు మేడిపల్లి హౌలీమేరీ మద్దతు తెలిపారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉయ్యాల దిలీప్‌కుమార్‌, మోదుగు చిన్న వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.ఆగిరిపల్లి : ఆగిరిపల్లిలోని పెద్ద కొఠాయి సెంటర్‌ వద్ద అంగన్వాడీలు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి మానవహారం నిర్వహించారు. అనంతరం తహాశీల్దార్‌ కార్యాలయ పిఒఎల్‌ఆర్‌ ఆర్‌ఐ నాంచారమ్మకు వినతిపత్రం అందించారు. సిపిఎం మండల కార్యదర్శి చాకిరి శివనాగరాజు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సత్తు కోటేశ్వరరావు, ముత్యాల నరేష్‌, అంగన్వాడీ కార్యకర్తలు అన్నమ్మ, అనురాధ, పుల్లమ్మ, కరుణ, రూప, జ్యోతి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. కొయ్యలగూడెం : కొయ్యలగూడెంలో అంగన్‌వాడీలు తహశీల్దార్‌కు వినతిపత్రం అందించేందుకు కార్యాలయానికి ర్యాలీగా వెళ్లగా అక్కడ తహశీల్దార్‌ లేరు. అక్కడినుంచి ఎంపిడిఒ కార్యాలయానికి వెళ్లగా అక్కడ కూడా ఎంపిడిఒ లేకపోవడంతో ఎఒకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ అధ్యక్షులు కె.శివరత్నకుమారి, జె.నాగవేణి, పద్మజ, అడపా జ్యోతి, కె.భవాని పాల్గొన్నారు.ఉంగుటూరు : అంగన్‌వాడీల న్యాయబద్ద డిమాండ్లు సాధించేంతవరకూ వారివెంట ఆందోళనలో ఉంటామని ఉంగుటూరు మండలానికి చెందిన టిడిపి సర్పంచులు అన్నారు. ఉంగుటూరులో సమ్మె శిబిరాన్ని వారు సందర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిడిపి ఉంగుటూరు నియోజకవర్గ సర్పంచుల నాయకురాలు, చేబ్రోలు సర్పంచి లక్ష్మీసునీత మాట్లాడారు. ఉంగుటూరు, తల్లాపురం, గొల్లగూడెం, కైకరం సర్పం చులు బండారు సింధు, పసుపులేటి నరసింహరావు, ల గోపీ, వెంకట శ్రీనివాసరావు పాల్గొన్నారు. శిబిరంలో ఉన్న వారికి సర్పంచులు శీతల పానీయాలను అందించారు.జీలుగుమిల్లి : మండలంలో అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసి భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం రహదారిపై ర్యాలీగా వెళ్లి జగదాంబ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు, అప్పారావు, సిఐటియు కార్యదర్శి కొండలరావు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు నాగమణి, ఎస్తేరు, సరళ, జ్యోత్స్న పాల్గొన్నారు.నూజివీడు టౌన్‌ : నూజివీడు పట్టణంలో అంబేద్కర్‌ బొమ్మ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి.రాజు, పట్టణ అధ్యక్షులు ఎన్‌ఆర్‌.హనుమాన్‌, అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు ఆదిలక్ష్మి, మణి, పద్మ, విజయలక్ష్మి, లక్ష్మి, జ్యోతి, గ్లోరీ పాల్గొన్నారు.మండవల్లి : సమ్మె శిబిరం వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. టిడిపి నాయకులు కొడాలి వినోద్‌ అంగన్వాడీలకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్ర మంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు. భీమడోలు : భీమడోలు సాయిబాబా ఆలయ సమీపంలో శిబిరం వద్ద అంగన్వాడీలు మోకాళ్లపై నిల్చుని, కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. శిబిరాన్ని యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి సంద ర్శిం చారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక కార్యక్ర మంలో ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎంఎ ల్‌సి షేక్‌ సాబ్జీ మృతి పట్ల సంతాపం తెలిపారు. టి.నరసాపురం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ జెవి.సుబ్బారావుకు, ఎంపిడిఒ కార్యాలయంలో సత్యనారాయణకు వినతిపత్రాలు అందించారు. అనంతరం కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు అనుమాలు మురళి, సిఐటియు నాయకులు, కార్యకర్తలు బి.ఫణివర్ధిని, ఎన్‌.మార్తమ్మ, ఎం.సత్యవతి, కె.బాబి, జి.రామదుర్గ, బి.అచ్చలమ్మ పాల్గొన్నారు.ముదినేపల్లి : అంగన్వాడీ కార్యకర్తలు ముదినేపల్లిలో వంటావార్పు నిర్వహించారు. టిడిపి నియోజకవర్గ యువనేత కొడాలి వినోద్‌, మాజీ ఎంపిపి వీరమల్లు నరసింహరావు, మహిళా నాయకురాల కె.పద్మ వంటావర్పు కార్యక్రమంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకురాలు అరుణ, చిన్నం మాధవ, పద్మ పాల్గొన్నారు.కలిదిండి : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట శిబిరం వద వంటావార్పు చేపట్టారు. తహశీల్దార్‌ వంశీ, ఎంపిడిఒ దినతేజ్‌లకు వినతిపత్రం అందించారు. సిఐటియు మండల అధ్యక్షులు షేక్‌ అబిదా బేగం, కార్యదర్శి జక్కుల మహేష్‌, ఉపాధ్యక్షులు చిన్నం శ్రీకాంత్‌, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి శేషపు మహంకాళిరావు, అంగన్వాడీ సంఘం నాయకులు జక్కంశెట్టి మేనకలక్ష్మి, కొప్పినీడి రమాదేవి పాల్గొన్నారు. ఎంఎల్‌సి సాబ్జీ మృతికి సంతాపం తెలిపారు. ముసునూరు : మండలంలోని ముసునూరు గ్రామ సచివాలయంలో అంగన్‌వాడీల నిరసన కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నర్సింహ మద్దతు తెలిపారు. టిడిపి మండల నాయకులు రాపర్ల ప్రతాప్‌, రాపర్ల బాలకృష్ణ, కాట్రేనిపాడు సర్పంచి సుహాసని మోహనరావు, ముసునూరు సర్పంచి కోండేటి విజయలక్ష్మి బాబి, కోండిబోయిన నాగేశ్వరరావు, తోట శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. అంగన్‌వాడీల ర్యాలీగా వెళ్లి తహాశీల్దార్‌ దాసరి సుధకు, ఎంపిడిఒ జి.రాణికి వినతపత్రాలు అందించారు.జంగారెడ్డిగూడెం : సిఐటియు పట్టణ అధ్య క్షులు పసల సూర్యరావు అధ్యక్షతన కొనసాగిన అంగ న్వాడీల సమ్మెలో భాగంగా ఆర్‌డిఒ కార్యాలయం నుంచి ఎంపిడిఒ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వ హిం చారు. ఎంపిడిఒ ప్రసాద్‌కు వినతిపత్రం అందించారు.పోలవరం : స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ఎదురుగా నల్ల చీరలు ధరించి నిరసన తెలిపినట్లు మండల కార్యదర్శి పిఎల్‌ఎస్‌.కుమారి అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి గుడెల్లి వెంకట్రావు, బొరగం భూ చందర్రావు, గిరిజన సంఘం మండల కార్యదర్శి మాట్లాడారు. ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతికి చింతస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.తాళాలు పగలగొట్టిన అధికారులు చాట్రాయి :మండలంలోని పర్వతాపురం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వేసి ఉన్న తాళా లను ప్రభుత్వం అధికారులు పగలకొట్టారు. రెవె న్యూ, గ్రామ సచివాలయ సిబ్బందికి బాధ్యతలు అప్పగిం చారు. ఎంపిడిఒ కె.దుర్గాప్రసాద్‌, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఇఒపిఆర్‌డి మురళీకృష్ణ తాళాలు పగలకొట్టారు.కొయ్యలగూడెం : మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను గురువారం అర్ధరాత్రి అధికారులు పగలకొట్టారు. పరింపూడిలో తాళాలు పగలకొడుతుండగా ఇంటి యజమానులు, స్థానికులు అడ్డుకున్నారు. తాళాలు పగలకొట్టినవారిపై కేసు నమోదు చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు, అంగన్‌వాడీలు డిమాండ్‌ చేశారు. జంగారెడ్డిగూడెం : మండలంలోని గురవాయిగూడెంలో తాళాలు పగలకొట్టి అంగన్‌వాడీ కేం ద్రం తెరిచారు. గురవాయిగూడెం సర్పంచి గుబ్బల సత్య వేణి, ఎంపిటిసి సభ్యులు రమారెడ్డి తాళాలను పగల కొట్టారు. గ్రామ సచివాలయ సిబ్బంది మహిళా పోలీసుల సమక్షంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహించారు.కలిదిండి : మండలంలోని ఆరుతెగలపాడు, చింతలమోరు, కోరుకొల్లు 1, 2, 3, 4, 5, 6, చైతన్యపురం, కోట కలిదిండి 1, 2, 3, మిలటరీ పేట, కొండంగి మెయిన్‌, పెదలంక ఎస్‌సి సెంటర్‌ అం గన్‌వాడీ కేంద్రాల తాళాలను మహిళా పోలీస్‌, విఆర్‌ఒ, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సూపర్‌ వైజర్ల సమక్షంలో పగలకొట్టారు. ముదినేపల్లి : మండలంలోని దేవపూడి, కొత్తపల్లి, వణుదుర్రు గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు వేసి ఉన్న తాళాలను సచివాలయ ఉద్యోగులు, మహిళా పోలీస్‌ పగలగొట్టి కొత్త తాళాలు వేయించారు. అధికారులను అడ్డుకున్న తల్లులు, బాలింతలు, గర్భిణులుఉంగుటూరు : అంగన్‌వాడీల కేంద్రాలను బలవంతంగా తెరిపించేందుకు అధికారులు ప్రయత్నిం చారు. 182 సెంటర్‌ను ఎంపిడిఒ ప్రేమాన్విత, ఎంఇఒ శ్రీనివాసరావు, పంచాయతీ సెక్రటరీ గిరిధర్‌, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టారు. కొత్త ఉంగు టూరు అంగన్‌వాడీ కేంద్రాన్ని తెరిచేందుకు అధికారులు వెళ్లగా గ్రామస్తులు, తల్లులు, బాలింతలు, గర్భిణులు అడ్డు కున్నారు. దీంతో అధికారులు వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతికి సంతాపంనిడమర్రు :ఉభయ గోదావరి జిల్లాల ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలియగానే అంగన్‌వాడీలు సమ్మె విరమించారు. షేక్‌ సాబ్జీ చిత్రపటానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అంగన్‌వాడీలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఆర్‌.రామలక్ష్మి, ఎ.నాగమణి, ఎం.నాగేశ్వరి, ధనలక్ష్మి కుమారి, స్వరాజ్యలక్ష్మి నాయకత్వం వహించారు.జీలుగుమిల్లి : ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతి పట్ల సిపిఎం, అంగన్‌వాడీ కార్యకర్తలు సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులర్పించారు. అనంతరం జాతీయ రహదారిపై ఆయన చిత్రపటంతో మానవ హారం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి తెల్లం దుర్గారావు, కొండలరావు, అప్పారావు, సీతారామయ్య, పాల్గొన్నారు.బుట్టాయగూడెం : ఎంఎల్‌సి సాబ్జీ మృతికి చింతిస్తూ బుట్టాయగూడెం అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్ప ర్స్‌ సిఐటియు, గిరిజన సంఘం నాయకులు సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఉంగుటూరు : ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ అకాల మృతిపై అంగన్‌వాడీలు తీవ్ర ద్రిగ్భాంతిని వ్యక్తం చేశారు. కార్మిక, ఉద్యోగులు, అంగన్‌వాడీ సంక్షేమం కోసం పోరాటం చేసే సాబ్జీ మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

➡️