ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కృషి

ప్రజాశక్తి – భీమడోలు

ఆటో డ్రైవర్ల సంక్షేమానికి, అభివృద్ధికి జనసేన తన వంతు సహాయ సహకారాలు అందజేస్తుందని ఆపార్టీ ఉంగుటూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జి పి.ధర్మరాజు హామీ ఇచ్చారు. భీమడోలులో గురువారం నిర్వహించిన ఆటో యూనియన్‌ సమావేశానికి ఆయన హాజరయ్యారు. యూనియన్‌ గౌరవాధ్యక్షులు బాదర్వాడ కృష్ణమోహన్‌ రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌ రాజు యూనియన్‌ ఆశయాలు, లక్ష్యాలు, ప్రజలకు అందిస్తున్న సేవలను ధర్మరాజు దృష్టికి తెచ్చారు. అనంతరం యూనియన్‌ భవన నిర్మాణానికి రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని ధర్మరాజు యూనియన్‌ గౌరవాధ్యక్షులు చేతుల మీదగా యూనియన్‌ అధ్యక్షులు సాంబశివరావు చేతికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన భీమడోలు అధ్యక్షులు పత్తి మదన్‌ పాల్గొన్నారు.

➡️