జాతీయస్థాయి పోటీలకు గుండుగొలను విద్యార్థి

ప్రజాశక్తి – భీమడోలు

చత్తీస్‌ఘడ్‌లో ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే స్టాప్‌ బాల్‌ జాతీయస్థాయి పోటీల్లో మండలంలోని గుండుగొలను హై స్కూల్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి గంటా అజరు రాష్ట్ర జట్టు సభ్యునిగా పాల్గొననున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారపాటి కనకదుర్గ సునీత, పీడీ వి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఇటీవల గుంటూరులో స్టాప్‌ బాల్‌(అండర్‌-14 విభాగం) రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించారు. జిల్లా సభ్యునిగా పోటీల్లో పాల్గొన్న అజరు కనబరిచిన ప్రతిభ ఆధారంగా రాష్ట్ర జట్టు సభ్యునిగా నిర్వాహకులు ఎంపిక చేశారు. ఈమేరకు రాష్ట్ర జట్టు ప్రతినిధిగా జాతీయ స్థాయి పోటీల్లో అజరు పాల్గొననున్నాడని వారు తెలిపారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన అజరును పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, పాఠశాల పీడీ, వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణారావుతో పాటు పలువురు గ్రామ ప్రముఖులు అభినందించారు.

➡️