నాలుగో విడత ఆసరా చెక్కుల పంపిణీ

బుట్టాయగూడెం: బుట్టాయగూడెం ఎంపిడిఒ కార్యాలయం ఆవరణలో వైఎస్‌ఆర్‌ క్రాంతి పథం ఆధ్వర్యాన నాలుగో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ పిఒ ఎం.సూర్య తేజ, పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు, నియోజకవర్గం ఇన్‌ఛార్జి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. వీరి చేతుల మీదగా మండలంలోని 888 సంఘాలకు, 8,878 సభ్యులకు రూ.4 కోట్ల 48 లక్షల 10 వేల చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ బాలరాజు, పోలవరం నియోజకవర్గం సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఈ మొత్తాన్ని మహిళల జీవనోపాధికి వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిపి కారం శాంతి, జెడ్‌పిటిసి సభ్యులు మొడియం రామ తులసి, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ బాజీ పాల్గొన్నారు.

➡️