పేదలకు రగ్గులు పంపిణీ

Jan 2,2024 21:44

పోలవరం : చలికాలం, శీతల గాలుల నుంచి రక్షణ కోసం పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం సూపరిండెంట్‌ ఎంవి.సతీష్‌ బాబు మంగళవారం పలువురు పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సతీష్‌ బాబు మాట్లాడుతూ తనతో పాటు వైద్య వృత్తిలో ఉన్న కొందరు వచ్చే ఆదాయంలో రెండు నుంచి ఐదు శాతం స్వచ్ఛంద సేవ కోసం కేటాయించాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు. ఆ నిర్ణయం మేరకు సొంత ఖర్చులతో కొని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైధ్యాధికారిణి గెడ్డం జ్యోతి, రాంబాబు పాల్గొన్నారు.

➡️