భీమడోలులో ‘గడపగడపకూ మన ప్రభుత్వం’

ప్రజాశక్తి – భీమడోలు

ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల వాసు బాబు ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం గురువారంతో 267వ రోజుకు చేరింది. కార్యక్రమంలో భాగంగా ఎంఎల్‌ఎ భీమడోలు గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామ సచివాలయం-2 ఏరియాలో రెండవ రోజు పర్యటించారు. దీనిలో భాగంగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హులు ఎవరికైనా లబ్ధి చేకూరకుంటే వారికి లబ్ధి చేకూరే విధంగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భీమడోలు జెడ్‌పిటిసి తుమ్మగుంట భవాని రంగా, ఎంపిపి కె.రామయ్య, భీమడోలు సర్పంచి సునీత మాన్సింగ్‌, ఎఎంసి ఛైర్‌పర్సన్‌ ఇంజేటి నీలిమ జూనియర్‌, ఎంపిటిసిలు జాన్సన్‌, కృష్ణ చైతన్యతో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి ఠాగూర్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

➡️