భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలి

జంగారెడ్డిగూడెం : ప్రజా వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకువచ్చిన లాండ్‌ టైటిల్‌ చట్టాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని చింతలపూడి మాజీ ఎంఎల్‌ఎ గంటా మురళీ రామకృష్ణ అన్నారు. మంగళవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని మురళీ రామకృష్ణ సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఐదవ రోజు రిలే నిరాహార దీక్షలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అచ్యుత శ్రీనివాసరావు, న్యాయవాదులు ముళ్ళపూడి శ్రీనివాసరావు, గన్నమని శేఖర్‌, షేక్‌ హీరాహకీం, మాదేపల్లి క్రాంతికమార్‌లు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మండవ లక్మణరావు పాల్గొన్నారు.

➡️