రోడ్డుపై గుంతలు.. ఆగని ప్రమాదాలు

అధ్వానంగా రహదారి
ఇబ్బందుల్లో ప్రయాణికులు, వాహనదారులు
పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం
జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏరియా ఆసుపత్రికి వెళ్లే రోడ్డులో ఆచార్య భరద్వాజ నగర్‌ దగ్గర నుంచి శ్రీనివాసపురం హైవే వరకు రోడ్డంతా గోతులతో అధ్వానంగా తయారైంది. దీంతో పాదచారులు, ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి సమయంలో ద్విచక్రవాహనదారులు రోడ్డుపై గుంతల్లో పడి ప్రమాదాలకు గురవతున్నారని స్థానికులు చెబుతున్నారు. రోడ్డు అధ్వానంపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్నందున ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి అధ్వాన స్థితిలో ఉన్న రోడ్డుపై గుంతలను పూడ్చాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

➡️