వాలంటీర్ల సేవలకు వందనం : ఎంఎల్‌ఎ డిఎన్‌ఆర్‌

ప్రజాశక్తి – కలిదిండి

సంక్షేమ పథకాల క్యాలెండర్‌ అమలులో వాలంటీర్ల సేవలకు వందనమని కైకలూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. స్థానిక మార్కెట్‌ యార్డ్‌ అవరణలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు, ఎంఎల్‌సి జయమంగళ వెంకటరమణ పాల్గొని సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రలకు ప్రశంసా పత్రాలు, నగదు పురస్కారాలను అందజేశారు. ఎంపిపి చందన ఉమామహేశ్వరరావు, జెడ్‌పిటిసి బొర్రా సత్యవతి, సర్పంచి మసిముక్కు మారుతీ ప్రసన్న వెంకటేశ్వరరావు, బత్తిన ఉమామహేశ్వరరావు, మహాదేవ విజయబాబు, ఎఎంసి ఛైర్మన్‌ కొల్లాటి సత్యన్నారాయణ, ఎంపిటిసిలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.

➡️