‘స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తా’

ప్రజాశక్తి – ముసునూరు

స్వతంత్ర ఆభ్యర్ధిగా పోటి చేస్తా.. మీ అండదండలు నాకు వుండలంటూ ముసునూరు గ్రామ ప్రజలను మాజీ ఎంఎల్‌ఎ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కోరారు. శనివారం మండలంలోని ముసునూరు గ్రామంలోని పోలీస్‌ స్టేషన్‌ సెంటర్‌ వద్ద భారీ బహిరంగ సభ(ఆత్మీయ సమావేశం) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి నూజివీడు నియోజక వర్గంలోని నాలుగు మండలాల టిడిపి నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నేనంటో ఏంటో తెలుసన్నారు. అందరి వాడిలా వుంటూ పార్టీ కార్యక్రమాలన్ని రాష్ట్ర స్థాయిలోనే సింగల్‌ వరుసలో పనులు చేస్తుంటే టికెట్‌ ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. ఎక్కడో పెనుమాలూరు వైసిపి ఎంఎల్‌ఎను టిడిపి సభ్యత్వం కుడా లేకుండా, పార్టీలో కూడా చేరకుండా నూజివీడు టిక్కెట్‌ కేటియించడం దుర్మార్గమన్నారు. నేను చేసిన తప్పేంటని ఆవేదన వ్యక్తం చేశారు. కావున నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని ప్రజలందరూ ఓటు వేసి అఖండ మోజార్టీతో గెలిపించాలని కోరారు.

➡️