11న జాతీయ కవి సమ్మేళనం

ఏలూరు అర్బన్‌: సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ కళా వేదిక ఈనెల 11వ తేదీన కొయ్యలగూడెంలో జాతీయ తెలుగు సాహిత్య సదస్సు 129వ జాతీయ కవి సమ్మేళనం జరపనున్న నేపథ్యంలో కార్యక్రమ బ్రోచర్‌ని మంగళవారం రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్‌పర్సన్‌ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ఆవిష్కరించారు. ఈ బ్రోచర్‌ ఆవిష్కరణలో పాల్గొన్న వారిలో కళావేదిక రాష్ట్ర కార్యదర్శి శ్రీహరికోటి, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గురుశర్మ, కో-కన్వీనర్‌ ఎంజె.సుజరు కృష్ణ పాల్గొన్నారు.

➡️