162 కొత్త పెన్షన్ల పంపిణీ

కలిదిండి : స్థానిక గ్రామ సచివాలయం వద్ద 162 మంది నూతన పెన్షన్ల లబ్ధిదారులకు పెంచిన మొత్తంతో కలిపి రూ.3వేలు చొప్పున కైకలూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు పంపిణీ చేశారు. పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి చందన ఉమామహేశ్వరరావు, జెడ్‌పిటిసి బొర్రా సత్యవతి పాల్గొన్నారు.

➡️