వేసవి శిక్షణ శిబిరాలతో విజ్ఞానం, వినోదం

ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.హైమావతి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వి.ఠాగూర్‌రాజా
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
విద్యార్థుల్లో విజ్ఞానం, వినోదం పెంపొందించటమే హేలాపురి చిల్డ్రన్‌ క్లబ్‌ సమ్మర్‌ క్యాంపుల ఉద్దేశమని ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.హైమావతి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు వి.ఠాగూర్‌రాజా అన్నారు. ఏలూరులో గత వారం రోజుల నుంచి జరుగుతున్న హేలాపురి చిల్డ్రన్‌ క్లబ్‌ సమ్మర్‌ క్యాంపుల్లో భాగంగా గురువారం జిల్లా గ్రంథాలయం, బాలల గ్రంథాలయం, జింగిల్‌ బెల్‌ స్కూల్‌ వద్ద జరిగిన శిబిరాల్లో వారు మాట్లాడారు. ఈ వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరాలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారన్నారు. శిబిరాల్లో విద్యార్థులకు చిత్రలేఖనం, సంగీతం, డ్యాన్స్‌, ఆడ పిల్లలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌ ట్రిక్స్‌ నేర్పుతున్నారన్నారు. స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకులు, సంఘ సంస్కర్తల జీవిత విశేషాలు తెలియ జేస్తున్నామని చెప్పారు. చిల్డ్రన్‌ క్లబ్‌ సమ్మర్‌ క్యాంపుల కార్యదర్శి పి.దుర్గాప్రసాద్‌, క్యాంపు నిర్వాహకులు జి.శారద, రాజేశ్వరి, యు.దుర్గ, పవన్‌ రిసోర్స్‌ పర్సన్‌గా బోధిస్తున్నారు. జిల్లా గ్రంథాలయం నిర్వాహకులు సందీప్‌, ఇస్లామ్‌, బాలల గ్రంథాలయ నిర్వాహకులు కీర్తి, శోభా పాల్గొన్నారు.

➡️