చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి

Feb 17,2024 15:50

ప్రజాశక్తి-ఉండి(పశ్చిమ-గోదావరి): చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరి అని న్యాయ విజ్ఞాన సదస్సు న్యాయవాది అంబేద్కర్ అన్నారు. శనివారం ఉండి మండలం చెరుకువాడ గ్రామపంచాయతీ సర్పంచ్ కొండవీటి సాంబశివరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాదులు అంబేద్కర్, బంటుమిల్లి సురేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వాహన చట్టంలో భాగంగా లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని, 18 సంవత్సరాల లోపు వారికి వాహనాన్ని ఇవ్వకూడదని లేనిపక్షంలో వారిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ వాహనానికి ఇన్సూరెన్స్ చేయించాలని సూచించారు. పి ఎల్ వి పాలూరి బాలాజీ మాట్లాడుతూ లీగల్ నోటీసు, ప్రామిసరీ నోట్ ల పై అవగాహన కలిగి ఉండాలని లేని పక్షంలో మోసాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్ రవీంద్ర, మండల విస్తరణ అధికారి ఏ కొండలరావు, గ్రామపంచాయతీ కార్యదర్శి కేశిరెడ్డి గోపాలకృష్ణ, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

➡️