మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్‌ కుమారుడి ఆదర్శ వివాహం

  •  నూతన వధూవరులను దీవించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమ-గోదావరి) : పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్‌ కుమారుడు డా. జితేంద్ర, డా. స్వాతిల వివాహ వేడుక స్థానిక శ్రీ రామచంద్ర గార్డెన్‌లో మంగళవారం ఆదర్శంగా జరిగింది. వధూవరులను రాష్ట్ర సిపిఎం కార్యదర్శి వి.శ్రీనివాసరావు హాజరై దీవించారు. వివాహ వేడుకను ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు సారధ్యంలో జరిగింది. ఈ వేడుకలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం, ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు, కవురు శ్రీనివాస్‌, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరామ్‌, టిటిడి సభ్యులు మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ వల్లభు నారాయణమూర్తి, ఇంకా పట్టణ సిపిఎం కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, పట్టణంలోని వైద్యులు, అడ్వకేట్లు, రాజకీయ ప్రముఖులు, సిపిఎం, ప్రజాసంఘాల నేతలు హాజరై నూతన వధూవరులను దీవించారు.

➡️