సర్వీసు ఓటర్ల ఓటుహక్కు వినియోగం

May 17,2024 21:29

కలెక్టరేట్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న సర్వీసు ఓటర్లు
ప్రజాశక్తి-గుంటూరు :
గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించిన సర్వీస్‌ ఓటర్లు ఎలక్ట్రోనికల్లీ ట్రాన్స్మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టమ్‌ (ఈటీపిబిఎస్‌) ద్వారా ఓటింగ్‌ చేసి పోస్ట్‌ చేసిన కవర్లను శుక్రవారం కలక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌, గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డికి పోస్టల్‌ శాఖాధికారులు పోటీలో వున్న అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి పోటీలో వున్న అభ్యర్థులు , వారి ప్రతినిధుల సమక్షంలో ట్రెజరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు తెరిచి కవర్లను భద్రపరిచి తిరిగి స్ట్రాంగ్‌ సీజ్‌ చేశారు.

➡️