వేంపల్లె జర్నలిస్టులపై పెట్టిన ఆక్రమ కేసు కొట్టివేత

Jun 11,2024 17:07 #fake case, #Journalist, #Kadapa, #police
  • డిఎస్పీకి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టులు

ప్రజాశక్తి – వేంపల్లె (కడప) : వేంపల్లె జర్నలిస్టులపై ఆక్రమంగా పెట్టిన ఇసుక కేసును పులివెందుల డిఎస్పీ వినోద్‌ కుమార్‌ కొట్టి వేశారు. వేంపల్లి పాపాగ్ని నది నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారనే అభియోగంపై 2023 సెప్టెంబర్‌లో రాజకీయ నాయకుల ఒత్తిడితో వేంపల్లెలోని 9 మంది జర్నలిస్టులపై జెపి కంపెనీ ప్రతినిధులు పిర్యాదు మేరకు అక్రమ కేసును నమోదు చేయడం జరిగింది. ఈనేపథ్యంలో పులివెందుల డిఎస్పీ వినోద్‌ కుమార్‌, సిఐ చాంద్‌ బాషాలు ఈ కేసుపై విచారణ చేయడంతో నిజా నిజాలు తెల్చారు. జర్నలిస్టులపై పెట్టిన కేసు తప్పుడు కేసు అని ఆ కేసును కొట్టి వేసినట్లు సిఐ చాంద్‌ బాషా తెలిపారు. జర్నలిస్టులపై ఉన్న అక్రమ కేసును విచారణ చేసి కొట్టివేయడంతో పులివెందుల డిఎస్పీ వినోద్‌ కుమార్‌కు, సిఐ చాంద్‌ బాషాకు జర్నలిస్టులు ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.

➡️