లారీ ఢీకొని రైతు మృతి

Jan 30,2024 13:06 #died, #Farmer, #lorry accident

టీ.నర్సాపురం (ఏలూరు) : రైతును లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే రైతు మృతి చెందిన ఘటన మంగళవారం టీ.నర్సాపురంలో జరిగింది. స్థానిక పెద్ద చెరువు సమీపంలో పొలానికి వెళుతున్న రైతు మరియన్నను, గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే పనులకు సంబంధించిన లారీ ఢీకొట్టడంతో రైతు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️