నష్టాల ఊబిలో ‘ఉద్యాన’రైతులు

ఈ ఏడాది ఉద్యాన పంటలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. ధరల పతనంతో ఆందోళన చెందుతున్నారు. తెగుళ్ల కారణంగా దిగుబడి అంతంతమాత్రమే ఉన్నా బొప్పాయి, చీనీ కాయలకు ధరలు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొనేళ్లుగా వాణిజ్య పంటలు సాగు చేసి తీవ్ర నష్టాలు చూసిన రైతులు ఈ సారి బోరు బావుల ద్వారా ఉద్యానవన పంటలపై ఆసక్తి చూపారు. ఉద్యాన పంట ఉత్పత్తులు చేతికి వచ్చిన సమయంలో ధరలు లేకపోవడంతో నష్టాలు వస్తున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాశక్తి – సింహాద్రిపురం పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, తొండూరు, లింగాల, పులివెందుల, వేముల మండలాలలో దాదాపు 27 వేల హెక్టార్లలో చీని సాగులో ఉంది.జిల్లాలోనే పులివెందుల నియోజవర్గంలోని చీని కాయలకు రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రాంత చీనీ కాయలు అధిక రోజులు నిల్వ ఉండడంతో పాటు, కాయలు నాణ్యత సైతం బాగా ఉండడంతో మంచి డిమాండ్‌ ఉంది. ఇక్కడి నుంచి కాయలను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చీని చెట్లకు తెగులు అధికం కావడంతో వాటిని నివారణ కోసం వేల రూపాలయు వెచ్చించి క్రిమిసంహారక పిచికారి మందులు కొడుతున్నా ఏం మాత్రం ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో టన్ను చిన్ని కాయలు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు ఉండేది. వ్యా పారులు తోటల వద్దనే కొనుగోలు చేశారు. అ ఏడా ది టన్ను రూ. 36 వేలు దాటకపోవడంతో తీవ్ర నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. ధరల స్థిరీకరణ ఏర్పాటు చేశామంటున్న పాలకులు, ప్రభు త్వం ఆ మేరకు ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖ లాలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బొప్పాయి ధరలు పతనం … నియోజకవర్గం వ్యాప్తంగా బొప్పాయి సాగు ఇటీవల కాలంలో ఘననీయంగా పెరిగింది. రెండేళ్ల నుంచి ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు వాటి సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ప్రారంభంలో టన్ను బొప్పాయి కాయలు రూ. 14 వేల నుంచి రూ. 16 వేలకు నడిచింది. అయితే ఇటీవల వ్యాపారులు ధరలను అమా ంతంగా తగ్గించడంతో తీవ్రంగా నష్టపోతున్నామని సాగు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులివెందుల ప్రాంతం నుంచి పంట ఉత్పత్తులను వ్యాపారులు స్థానికంగా కొనుగోలు చేసి తమిళనాడు ,మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ ,పంజాబ్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే పై మార్కెట్లో ధరలు తగ్గినట్లు దళారులు చెబుతూ కేవలం తోటల వద్ద తను టన్ను రూ. 6 వేలకు కొనుగోలు చేయడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. టన్ను రూ. 15 వేలు ఉంటేనే కొంతమేర లాభసాటిగా ఉంటుందని, లేకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని బొప్పాయి రైతులు చెబుతున్నారు. ఏడాది అరటి ధరలు సైతం పెరగకపోవడం వల్ల అరటి రైతులు సైతం నష్టాలు చెవి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.ప్రభుత్వం నుంచి కరువైన ప్రోత్సాహం.. రెండేళ్ల నుంచి ఉద్యానవన పంటలు సాగుచేసిన రైతులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం నిలిపివేయడం పట్ల ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అరటి సాగు చేసే రైతులకు రెండు సంవత్సరాల సాగుకు కలిపి హెక్టారుకు రూ.4 వేలు ప్రోత్సాహం లభించేది. అదేవిధంగా బొప్పాయి సాగు చేసే రైతులకు హెక్టారుకు రూ. 2 వేల ప్రోత్సాహం ప్రభుత్వ అందజేసేది. గడిచిన రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఈ పథకాలను రద్దు చేసింది. ఈ ప్రోత్సాహం రాకపోవడం పట్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాగు పెట్టుబడి పెరిగింది రెండేళ్ల నుంచి చీనీ చెట్లకుకు తెగులు కారణంగా పెట్టుబడి భారీగా పెరిగింది. అయితే ఆశించిన మేరకు దిగుబడులు లేకపోవడంతో పాటు ధరలు కూడా ఆశాజనకంగా లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. తెగులపై అధికారుల దష్టికి తీసుకెళ్లిన ఏమాత్రం ప్రయోజనం లేదు.- గోపాల్‌ రెడ్డి, చీని రైతు, సింహాద్రిపురంబొప్పాయి ధరలు అమాంతంగా తగ్గాయి బొప్పాయి కి ధరలు బాగా ఉండటంతో సాగు చేపటాం. అయితే పంట చేతికొచ్చిన సమయంలో ధరల అమాంతంగా తగ్గిపోయాయి. కిలో కేవలం ఆరున్నర రూపాయితో మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా పెట్టుబడి రాకపోగా నష్ట వస్తోంది.-చంద్రమోహన్‌ రెడ్డి, బొప్పాయి రైతు, గురుజాల. ఉన్నతాధికారులకు తెలియజేస్తాం.. ప్రస్తుతం మార్కెట్‌ ధరలు కొంతమేర తగ్గిన విషయం వాస్తవమే. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. గతంలో ప్రభుత్వం అరటి, బొప్పాయి సాగు చేసే రైతులకు ప్రోత్సావ పథకాలను అందజేసేవారం. ఇటీవల కాలంలో ప్రభుత్వ ఈ పథకాలను రద్దు చేసింది.-వీరారెడ్డి, ఉద్యానవన శాఖ విస్తరణ అధికారి, సింహాద్రిపురం.

➡️