కేజ్రీవాల్ అక్రమ అరెస్టు ఖండిస్తూ ధర్నా చౌక్ వద్ద ఉపవాస దీక్ష

Apr 7,2024 15:23 #AAP leaders, #Dharna, #Kakinada

ప్రజాశక్తి-కాకినాడ : ఆమ్ ఆద్మీపార్టీ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో అరవింద్ క్రేజీవాల్ అక్రమ అరెస్టును ఖండిస్తూ దర్నాచౌక్ వద్ద శాంతియుతంగా ఉపవాస దీక్ష చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆఫ్ జిల్లా కన్వీనర్ నరాల శివ మాట్లాడుతూ ఎలక్ట్రోల్ బాండ్ కుంభకోణం లో ప్రజల దృష్టిని మరలించడం కొరకే అరవింద్ క్రేజీవాల్ అరెస్ట్ ఒక సాకు అని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో అడ్రస్ లేకుండా ఓడిపోబోతుందని అందుకే ఇతర పార్టీల ముఖ్యమంత్రిలను నాయకులను కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈ డి, సి బి ఐ, ఐ టి లను ఉసిగొల్పి అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో పెడుతున్నారన్నారు. రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలని కోరారు. బిజెపి మరల అధికారంలోకి రావడానికి ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు కూడా బిజెపి పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తూ పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమ్ఆద్మీపార్టీ మాజీ రాష్ట్ర కన్వీనర్ కాగా వరప్రసాద్,రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్, ఆమ్ఆద్మీపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రియాజ్ మహమ్మద్, వై. రాంబాబు, ఎన్ని ఎస్ రామారావు, మహాలక్ష్మీ, గంధ్రి నాగేశ్వరరావు కాకినాడ సీటి కోఆర్డినేటర్ వంగపండు కృష్ణమూర్తి, జిల్లా నాయకులు మహ్మద్ షాకీర్ తదితరులు ఈ నిరసన ఉపవాస దీక్షకు సంఘీభావంగా మద్దతు పలికారు.

➡️