మత్స్యకారులందరికీ పరిహారం ఇస్తాం : మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

ప్రజాశక్తి – తాళ్లరేవు (కాకినాడ) : తాళ్లరేవు మండలంలోని ఓఎన్జిసి పరిహారం అందని మత్స్యకారులందరికీ పరిహారం అందిస్తామని ముమ్మిడివరం ఉమ్మడి అభ్యర్థి దాట్ల సుబ్బరాజు హామీ ఇచ్చారు. ఓఎన్జిసి పరిహారం అందని మండలంలోని కోరంగి పంచాయతీ సీతారామపురం కొల్లాటివారి వీధికి పలువురు మత్స్యకారులు, స్థానిక మహిళలతో కలిసి శనివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ … గ్రామంలో మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేసుకుంటాం అని ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్న ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు తెలిపారన్నారు. ఓఎన్జిసి, రిలయన్స్‌ వంటి పరిహారాలు ఇప్పిస్తామని గ్రామంలో వారందరినీ నావలు ఎక్కించారని, ఫోటోలు తీసుకున్నారని, మా గ్రామాన్ని మాత్రం ఆ లిస్టులో చేర్చలేదన్నారు. అందువల్ల వందలాది కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయామని తెలిపారు. మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేసి అందరికీ పరిహారం అందేలా కఅషి చేస్తానని దాట్ల సుబ్బరాజు ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కర్రి సత్యనారాయణ, కోలాటి రాము, కర్రి పాపారావుల ఆధ్వర్యంలో 42 కుటుంబాల మత్స్యకారులు టిడిపిలోకి చేరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగ సూర్యనారాయణ, ధూళిపూడి వెంకటరమణ, పొన్నమండ రామలక్ష్మి, పెసింగి ఈశ్వరరావు, వాడ్రేవు వీరబాబు, వెంట పల్లి చంద్రమౌళి, వాసంశెట్టి శ్రీనివాస్‌, పెమ్మాడి కాశి విశ్వనాథ్‌, కొపనాతి దత్తాత్రేయ వర్మ, నడింపల్లి వినోద్‌, టేకుమూడి సత్యనారాయణ, మోపూరి వెంకటేశ్వరరావు, సోమరాజు, కుడుపూడి దుర్గాప్రసాద్‌, స్థానిక నాయకులు చిన్న, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.

➡️