డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన

ప్రజాశక్తి- గోకవరం(తూర్పుగోదావరి) : మండల కేంద్రమైన గోకవరం మురళి నగర్ లో డ్రైనేజీ నిర్మాణానికి సీనియర్ వైసిపి నాయకులు సుంకర వీరబాబు ఆధ్వర్యంలోవైసీపీ నాయకులు దాసరి చినబాబు, వరసాల ప్రసాద్, సుంకర రమణ, పులపర్తి బుజ్జి, శ్రీను,లు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సుంకర వీరబాబు మాట్లాడుతూ.. మండల పరిషత్ నిధుల నుండి 6 లక్షల రూపాయలతో నూతనంగా డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామంలోనే కాకుండా మండలంలోని ఏ పంచాయతీలో నైనా అపరిశుభ్ర వాతావరణం లేకుండా చక్కని వాతావరణాన్ని కల్పించాలని అత్యధికంగా డ్రైనేజీ నిర్మాణం,త్రాగునీరుకి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. తద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే వైసీపీ ప్రభుత్వం యొక్క లక్ష్యమని తెలిపారు.

➡️