ఉచిత పాలిసెట్ కోచింగ్

Mar 27,2024 17:49

ప్రజాశక్తి – గుడ్లవల్లేరు : పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు పూర్తిచేసిన విద్యార్థిని, విద్యార్థులకు స్థానిక ఏ ఏ ఎన్ ఎం అండ్ వి వి ఆర్ ఎస్ ఆర్ పాలిటెక్నిక్ లో ఉచిత పాలిసెట్ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎన్ రాజశేఖర్ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి 27 వరకు సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులచే శిక్షణ అందిస్తామని తెలిపారు. కోచింగ్ తీసుకునే విద్యార్థిని, విద్యార్థులు ఏప్రిల్ 1వ తేదీ లోపు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎస్ ఎస్ సి హాల్ టికెట్ జిరాక్స్ తో కాలేజీకి వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సీనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ కొడాలి శరత్ బాబు సెల్ నెంబర్ 7997508931 సంప్రదించవలసిందిగా కోరారు. ఈ కోచింగ్ ద్వారా పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచి ర్యాంక్లు సాధించి పేరొందిన పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు సాధించ వచ్చని ఆయన తెలిపారు.

➡️