నగరాభివృద్ధికి మరో అవకాశమివ్వండి

Apr 12,2024 21:32

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తనకు మరో అవకాశం ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం నగరంలోని ధర్మపురిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కోలగట్ల పాల్గొన్నారు. 2019లో తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే సామాన్యుడి పాలన ఏ విధంగా ఉంటుందో చూపించానని అన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలు ప్రజల చెంతకు చేరాయని చెప్పారు. కార్యక్రమంలో నగర మేయర్‌ వి.విజయలక్ష్మి, డివిజన్‌ ఇన్‌ఛార్జి కనకల కృష్ణ, కార్పొరేటర్‌ పతివాడ గణపతిరావు, మేయర్‌ విజయలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.కోలగట్లకు మద్దతుగా నేడు మహిళల ర్యాలీవిజయనగరం టౌన్‌ : వైసిపి అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామికి మద్దతుగా శనివారం నగరంలో మహిళలతో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నగర మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి తెలిపారు. శుక్రవారం వైసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నగరాభివృద్ధికి కోలగట్ల మళ్లీ గెలివాల్సిన చాలా అవసరం ఉందన్నారు. ఇప్పటికే గత ఐదేళ్ల పాలనలో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయం గా పని చేస్తున్న ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని గెలిపించేందుకు మహిళలు సిద్దంగా ఉన్నారని తెలిపాఉ. ఎన్‌సిఎస్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ విగ్రహం నుంచి కన్యకా పరమేశ్వరి, గంట స్థంభం, మూడు లాంతర్లు మీదుగా కోట జంక్షన్‌ వరకు ర్యాలీ ఉంటుందని, అనంతరం సభ జరుగుతుందని తెలిపారు. సమావేశంలో మహిళా కార్పొరేటర్లు, వైసిపి మహిళా విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️