ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు

Dec 21,2023 15:59 #ongle

ప్రజాశక్తి-గిద్దలూరు (ప్రకాశం) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కోలాహలంగా జరిగాయి. పట్టణంలోని నంద్యాల, ఒంగోలు జాతీయ రహదారిలోని చేరెడ్డి కార్యాలయం వద్ద నుండి వైయస్సార్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహిచారు. వైయస్సార్‌ విగ్రహనికి నివాళులు అర్పించారు. అనంతరం వైసీపీ నాయకుల అందరి సమక్షంలో భారీ కేక్‌ కట్‌ చేసి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, కేక్‌ అందరికీ పంచి పెట్టారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణి చేశారు. చేరెడ్డి కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుక పురస్కరించుకుని అన్నదానం చేవారు. ఈ సందర్బంగా చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం జగనన్న మల్లి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చేరెడ్డి జయరామిరెడ్డి, యర్రం వెంకట రామిరెడ్డి, వేమిరెడ్డి రామచంద్రరెడ్డి, ఇదమకంటి దిలీప్‌ కుమార్‌ రెడ్డి, మానం రమణారెడ్డి, మానం వెంకట రెడ్డి, పూసలపాడు బాలిరెడ్డి, అర్ధవీడు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

➡️