ప్రజల నెత్తిపై ఛార్జీల బండ

Mar 9,2024 12:34 #Guntur District

మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్
ప్రజాశక్తి-పొన్నూరు రూరల్ : పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో విద్యుత్ చార్జీలపై మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ ఎన్నికల ముందు బాదుడే బాదుడు అంటూ రోడ్డెక్కి గోలగోల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ఛార్జీల పేరుతో ప్రజల నెత్తిపై బండతో బాదుతున్నాడు అన్నారు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఛార్జీలన్నీ తగ్గించేస్తామంటూ మోసపూరిత హామీలిచ్చిన జగన్ మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీల పేరుతో సామాన్యుల నడ్డివిరిచిందే కాకుండా విద్యుత్ చార్జీలు పెంచుకూంటూ వెళ్లడమే తప్ప మరో పని లేదన్నట్లుగా ప్రజలకు షాకుల మీద షాకులిస్తున్నాడు అన్నారు. 2014లో 22.5 మిలియన్ యూనిట్ ల లోటు తో వున్న విద్యుత్ రంగం, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన చర్యల ఫలితంగా 10 వేల మెగా వాట్ ల అదనపు విద్యుత్ సామర్థ్యం పెరిగి, ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు చేపట్టే నాటికి మిగులు విద్యుత్ వుంది అన్నారు. విద్యుత్ కోతలు లేకుండా, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, ఇతర రాష్ట్రాలకు విద్యుత్ విక్రయించే స్థాయికి విద్యుత్ రంగం చేరుకుందన్నారు. ఐలుగేళ్లలో అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరగకపోవటం దారుణం విద్యుత్ కోతలు పెరగటంతో పాటు, పరిశ్రమలకు సైతం పవర్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్తితి ఉత్పన్నమైంది అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీపీఏలను రద్దు చేయటం విద్యుత్ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలు, అవినీతి కారణంగా విద్యుత్ వినియోగదారులపై దాదాపు రూ.60వేల కోట్ల భారం పడిందన్నారు. విద్యుత్ పంపిణీని క్రమబద్ధీకరించకుండా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి, కమిషన్ లు దండుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. వైసీపీ హయాంలో స్మార్ట్ మీటర్ల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ చేస్తురూ. 18 వేల విలువ చేసే స్మార్ట్ మీటర్ ను రూ.30 వేలకు కొనుగోలు చేయటం ద్వారా కమిషన్ల రూపంలో దాదాపు రూ.12 వేల కోట్లు ప్రజాధనం అక్రమార్కుల జేబుల్లోకి చేరుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు భారమంతా వినియోగదారులపై పడుతోంది. వీటికి తోడు టారిఫ్ ల కుదింపు, శ్లాబుల మార్పు, అదనపు డిపాజిట్ ల రూపంలో ఇష్టమొచ్చినట్లు విద్యుత్ చార్జీలను పెంచారన్నారు.
విద్యుత్ చార్జీల పెంపు కారణంగా వినియోగదారులపై వేలకోట్ల మేర అదనపు భారం పడింది. దీనికి తోడు పవర్ ఫీనాన్స్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు రూ. 36,261 కోట్లు, హిందుజా సంస్థకు చెల్లించేందుకు తెచ్చిన అప్పు రూ.2,883 కోట్లు భారాన్ని సైతం వినియోగదారులే భరించాల్సి రావడం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలకు, అవినీతికి ఉదాహరణ అని అన్నారు. ఈ ఐదేళ్లలో శ్లాబులు, టారిఫ్ లు మారుస్తూ.. దేనిపైనా స్పష్టత ఇవ్వకుండా ప్రజలను ఏమారుస్తూ విద్యుత్ ఛార్జీల భారం వేస్తున్నారు. కరెంట్ బిల్లు వస్తేగానీ జనానికి అర్థం కావడం లేదు విద్యుత్ ఛార్జీలు పెరిగాయనిసంక్షేమం పేరుతో ఒక చేత్తో రూపాయి ఇచ్చి.. కరెంట్ బిల్లుల పేరుతో మరో చేత్తో 10 రూపాయలు లాగేస్తున్నారు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో 2014-19 వరకు ఒక్కసారి కూడా ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం వేయలేదు. ఓ వైపు సంక్షేమం అందిస్తూనే అభివృద్ధి వైపు నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ బాజీ సాహెబ్, సిలార్ భాష, బండ్లమూడి బాబురావు, ఎద్దు సోంబాబు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️