కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె

Jan 11,2024 13:31 #Guntur District
anganwadi strike 31day in gnt

ప్రజాశక్తి-పొన్నూరు రూరల్ : పొన్నూరు పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ చేస్తున్న సమ్మె గురువారం 31వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలపై సూపర్వైజర్లు అనేక రకాలైన ఒత్తిళ్లు తీసుకొస్తు బెదిరిస్తున్నారని, వారి బెదిరింపులు సాగవు అన్నారు. అంగన్వాడి వర్కర్లు ఎవరు అధైర్య పడవద్దు అని అధికారుల ఒత్తిళ్లకు తలవంచవద్దని ఆయన ఈ సందర్బంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు నిమ్మకురి రమేష్ బాబు, యూనియన్ అధ్యక్షురాలు ఎంవి సుకన్య, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️