12వ రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె

Jan 6,2024 15:35 #Guntur District
anganwadi workers strike 26th day protest tenali
  •  కార్యాలయం ప్రధాన ద్వారా వద్ద బైఠాయించి నిరసన

ప్రజాశక్తి-తెనాలి : మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె శనివారం 12వ రోజుకు చేరింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో సమ్మెను కార్మికులు మరింత ఉధృతం చేశారు. సమ్మె కార్యాచరణలో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి సిబ్బంది రాకపోకలను నియంత్రించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, మృతి చెందిన కార్మికుడి స్థానంలో ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాసం కల్పించాలని, రిటైర్ అయిన కార్మికునికి పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని నినాదాలు చేస్తున్నారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షులు షేక్ హుస్సేన్ వలి, అధిక సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

➡️