గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించిన సిపిఎం

Mar 13,2024 13:22 #Guntur District

ప్రజాశక్తి- తెనాలి : ఇటీవల మృతి చెందిన గీతాంజలి కుటుంబ సభ్యులను సిపిఎం తెనాలి నాయకులు బుధవారం పరామర్శించారు. నాయకులు ములకా శివసాంబిరెడ్డి, షేక్ హుస్సేన్ వలి, కె రవికుమార్ లు ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆమె కుమార్తెలు రిషిత, ఋషిక భవిష్యత్తు దృష్టా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గీతాంజలి మృతికి కారణమైన దోషులను వెంటనే శిక్షించి మహిళలపై జరుగుతున్న అరాచకలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

➡️