గీతాంజలి కుటుంబానికి ఆర్థిక సహాయం

Mar 25,2024 15:17 #Guntur District

ప్రజాశక్తి-తెనాలి రూరల్ : ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ మాటల రచయిత కోన వెంకట్ సోమవారం పరామర్శించారు. స్థానిక వహాబ్ చౌక్ గీతాంజలి నివాసంలో తమ కుటుంబ సభ్యులను కలిసి రూ 1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. సోషల్ మీడియాలో వచ్చిన అసభ్య ట్రోలింగ్స్ కారణంగానే గీతాంజలి మృతి చెందిందని వెంకట్ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాఖాలో సంక్షేమం అందుకోవడమే తాను చేసిన తప్పు అని ప్రశ్నించారు. వైసిపి పాలనలో గీతాంజలి పొందిన సంక్షేమాలను ఒక యు ట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకోవడం నిమిషాలు వ్యవధిలోనే ఆమెపై సోషల్ మీడియా దాడిచేయడం బాధాకరమన్నారు. గతంలో సోషల్ మీడియా ట్రోలింగ్స్ కి గురైన వారిలో నేను ఒకడిని అని కన్నీటి పర్యంతమయ్యారు. సంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం హేయమైన చర్య అన్నారు. ఒక అమ్మ భార్యనే కాకుండా నిస్వార్థమైన సంతోషాన్ని పొట్టనపెట్టుకున్న ఎల్లో సోషల్ మీడియా వైఖరిని తీవ్రంగా ఖండించారు. రాబోయే తన సినిమాలో గీతాంజలి కుమార్తెలు రిషిత, ఋషిక లకు అవకాశం కల్పిస్తామన్నారు.

➡️