గుంటూరు కారం ఘాటు చూపిస్తా…

Mar 20,2024 12:52 #Guntur District

వైసిపి అభ్యర్ధి కిలారి రోశయ్య

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు కారం ఘాటు పెమ్మసానికి చూపిస్తానని గుంటూరు లోక్ సభ వైసిపి అభ్యర్ధి కిలారి రోశయ్య హెచ్చరించారు. అమెరికాలో ఉన్న తుపాకీ కల్చర్ ను గుంటూరు జిల్లాలో అమలు చేయాలని టిడిపి గుంటూరు లోక్ సభ అభ్యర్థి పెమ్మసాని బెదిరిస్తున్నారని ఆరోపించారు. గుంటూరు లోక్ సభ పరిధిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటుకి కృషి చేస్తానని ఆయన చెప్పారు. వైసిపిలో కాపులకి అధిక ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్ సామాజిక న్యాయం చేశారని అన్నారు. తాను పక్కా లోకల్ అభ్యర్థిని అని టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్ర శేఖర్ గెలిస్తే అమెరికా వెళ్లి పోతారని అన్నారు. గతంలో రెండు సార్లు గెలిచిన ఎంపి గల్లా జయదేవ్ కనీసం ఒక్క రోజు కూడా నియోజక వర్గంలో ఉండలేదని, ఏటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులు విడుదల రజిని, మురుగుడు లావణ్య, అంబటి మురళి, నూరి ఫాతిమా, బాలసాని కిరణ్, ఎమ్మెల్సీ లెళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️