జీవోల కాలయాపనపై ఆగ్రహం

Feb 5,2024 12:13 #Guntur District
municipal workers protest pending wages

ప్రజాశక్తి-ఎర్రబాలెం : రాజధానిలోని ఎర్రబాలెంలో సోమవారం పని విరామ సమయంలో జీవోల కాలయాపనకు వ్యతిరేకంగా మున్సిపల్ కార్మికులు నిరసన తెలిపారు. మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుదల జీవోను వెంటనే విడుదల చేయాలని కోరారు. జీవోలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఫిబ్రవరి 6న కలెక్టరేట్ వద్ద జరిగే మున్సిపల్ కార్మికుల ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం రవి మాట్లాడుతూ … మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించి నెలరోజులు కావస్తున్న ప్రభుత్వంతో కుదిరిన అంగీకార ఒప్పందాలకు సంబంధించిన జీవోలను ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం అన్యాయమని అన్నారు.  జీవోల విడుదల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ఇప్పటికైనా వెంటనే మున్సిపల్ కార్మికుల జీతాల పెంపుదల జీవోను విడుదల చేయాలని రవి డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు టి బాబు, ఓ రామారావు టి ఆదిలక్ష్మి ,ఎం పార్వతి ఎన్ దివ్య తదితరులు పాల్గొన్నారు.

➡️