రాజీనామాకు సిద్దమైన వాలంటీర్లు

Apr 8,2024 12:29 #Guntur District

ప్రజాశక్తి – తుళ్లూరు : వాలంటీర్లు రాజీనామాకు సిద్ధమయ్యారు. మండలంలోని హరిశ్చంద్రపురం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, మందడం గ్రామాలకు చెందిన 30 మంది వాలంటీర్లు రాజీనామా చేసేందుకు సోమవారం మండల పరిషత్ కార్యాలయం వద్దకు వచ్చారు. ఎండీవో శివన్నారాయణను కలిసి రాజీనామా విషయాన్ని తెలియజేయాలని వేచి ఉన్నారు. మంగళ, బుధవారల్లో మరికొంత మంది రాజీనామా చేస్తారని చెబుతున్నారు. మండల పరిధిలో 270 మంది వాలంటీర్లు ఉన్నారు.

➡️