రూ. 2 లక్షల హర్యానా మద్యం స్వాధీనం

Apr 5,2024 22:53

స్వాధీనం చేసుకున్న మద్యం
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
ఎన్నికల నేపథ్యంలో హర్యానా నుంచి తక్కువ ధరకు మద్యాన్ని తెచ్చి ఓటర్ల పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన రూ.2 లక్షల సరుకును పొన్నూరు ఎస్‌ఇబి అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు వివరాలను ఎస్‌ఇబి అదనపు ఎస్‌పి ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా అదనపు ఎపి రమణమూర్తి గుంటూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. పెదనందిపాడు మండలం వరగాని వద్ద పలు ప్రాంతాలకు రవాణాకు సిద్ధంగా ఉంచిన మద్యం నిల్వలను పొన్నూరు ఎస్‌ఇబి సిఐ ఎం.సుకన్య ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను గుర్తించగా చుండూరు నాగ సురేష్‌, నూనె ఏడుకొండలును పోలీసులు అరెస్టు చేశారు. గురజాల నాగరాజు, గుమ్మళ్ల కోటేశ్వరరావు పరారవగా వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హర్యానాలో ఈ మద్యం విలువ రూ.2 లక్షల రెండు వేలుగా పేర్కొన్నారు. వీరి వెనుక ఏ రాజకీయ పార్టీ ఉందనే అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఎల్‌.రంగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

➡️