‘పోలింగ్‌ రోజున దాడి చేసి గాయపరిచారు’

రెంటచింతల: ఈ నెల 13న పోలింగ్‌ సందర్భంగా పాల్వాయి గేటు గ్రామం లోని 202 పోలింగ్‌ బూత్‌లో తమపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారని, డాక్టర్‌ వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నా రహస్యంగా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని టిడిపి ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు చెప్పారు.

 

బుధవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బ్రహ్మారెడ్డి తో కలిసి మీడియాతో మాట్లాడుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేస్తూ సమ యంలో అడ్డుకున్న తనను గాయ పరి చారని తెలిపారు. ఇదిలా ఉండగా శేషగిరిరావును అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఫోన్‌ ద్వారా పరా మర్శిం చారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీసి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

➡️