వేతన బకాయి చెల్లించాలని ఆసుపత్రి పారిశుధ్య కార్మికుల నిరసన

ఆసుపత్రి పారిశుధ్య కార్మికుల నిరసన

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌: పాడేరు, అరకు, ముంచంగిపుట్టు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు బకాయిపడ్డ నాలుగు నెలల వేతనాలను చెల్లించాలని సిఐటియు అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్‌ వి ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గురువారం అరకులోయ ఏరియా ఆసుపత్రిలో పర్యటించి పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.అతి తక్కువ వేతనాలతో పారిశుధ్య పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌, వారికి సకాలంలో వేతనాలు చెల్లించక నెలలు తరబడి బకాయిలు పెట్టడం సరికాదన్నారు. దీంతో వేతనాలు అందక పారిశుధ్య కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలుతోపాటు బకాయి పడ్డ నాలుగు నెలల జీతాన్ని చెల్లించాలని, లేకుంటే విధులను బహిష్కరించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షులు రఘు, ఏరియా ఆసుపత్రి నాయకులు బాలన్న పాల్గొన్నారు.

అరకులోయ ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పారిశుధ్య కార్మికులు

➡️