అవకాశమిస్తే అభివృద్ధి చేస్తా

May 5,2024 20:35

ప్రజాశక్తి- డెంకాడ : ఒకసారి తనకు ఎమ్మెల్యేగా అవకాశమిస్తే నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఉమ్మడి కూటమి అభ్యర్థి లోకం నాగ మాధవి అన్నారు. మండలంలోని అక్కివరం, బంటుపల్లి, పినతాడివాడ, పెదతాడివాడ గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వస్తుందని, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తామని కంపెనీలు రావడానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర రావు, మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పల నారాయణ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

➡️