సమస్యలు పరిష్కరించకపోతే మర్చి 1 నుండి పనుల నిలిపివేత : గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్రస్‌ అసోసియేషన్‌

Feb 22,2024 10:59

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్రస్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశాన్ని అధ్యక్షులు గొంప చంద్రమౌళి ,ప్రధాన కార్యదర్శి సాధు రావుల సారథ్యంలో బుధవారం నిర్వహించామని గొంప చంద్రమౌళి తెలిపారు. ఈ సందర్భంగా రిజిస్టర్‌ కాంట్రాక్టర్ల సమస్యలపై మార్చి ఒకటవ తేదీలోపు పరిష్కారం చూపకపోతే జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను ఆపాలని ఏకగ్రీవ తీర్మానం చేశామని అన్నారు. అంతేకాకుండా స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా చేసిన పనులకు గత ఐదు సంవత్సరాలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని జీవీఎంసీ కమిషనర్‌ వారికి స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వారికి జనవరి 9న పంపడం జరిగినప్పటికీ ఇప్పటివరకు వాటిని చెల్లించలేదని, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని ఉద్దేశంతో నిర్వహించిన 25.1 కోట్ల కు టెండర్లు పిలిచి పనులు కూడా పూర్తి చేసిన పనులకు, జి-20 కోసం చేసిన పనులకు సిఎఫ్‌ఎంఎస్‌ లో కొన్ని బిల్లులు మాత్రమే అప్లోడ్‌ అయ్యాయని వివరించారు. సాంకేతిక కారణాలవల్ల కొన్ని బిల్లులు అప్లోడ్‌ కాలేదని సాంకేతిక సమస్యలను అధిగమించి బిల్లును వెంటనే చెల్లింపు జరపాలని మరొక తీర్మానంగా చేసామని తెలిపారు. బస్సు షెల్టర్ల చెల్లింపులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని పలు బిల్లులు లైబలిటీ పీరియడ్‌ దాటిన గత 18 నెలలుగా చెల్లింపు జరగలేదని కనుక సంబంధిత అధికారులు చొరవ చూపి బిల్లులు వెంటనే ప్రాసెస్‌ చేయాలని అధికారులు కోరడం జరిగిందని సమావేశంలో తెలిపామన్నారు. దాదాపు 200 మంది రిజిస్టర్‌ కాంట్రాక్టర్‌ సభ్యులతో కూడిన తమ బఅందం ఈ సమస్యలపై ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని, గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్ట్రస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు గొంప చంద్రమౌళి వివరించారు.

➡️