ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ సూచనలు

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా పల్నాడు జిల్లాలో నిర్వహించనున్న పోలింగ్‌ సందర్భంగా ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి శివ శంకర్‌ లోతేటి 97-నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట పల్నాడు రోడ్డులో గల ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో భద్రపరిచిన ఎన్నికల సామాగ్రి ఈవిఎం ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … పల్నాడు జిల్లాలో ప్రశాంత పోలింగ్‌ కి సర్వం సిద్ధం చేయడం జరిగిందన్నారు. నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,30,572 వేల మంది ఓటర్లు, 245 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 1929 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 10,800 మంది మీద బైండ్‌ ఓవర్‌ కేసులు పోలీసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు పల్నాడు జిల్లాలో నగదు, మద్యం, బంగారు ఆభరణాలు రూ5.09 కోట్లు స్వాధీనం చేసుకున్నామని ఆధారాలు పరిశీలించిన పిదప తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా పోలింగ్‌ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి పి.సరోజిని, నోడల్‌ అధికారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

➡️