ప్రజాసేవకు అంకితమవుతా : జగదీశ్వరి

Jun 14,2024 21:24

ప్రజాశక్తి – జియ్యమ్మవలస : అఖండ విజయాన్ని అందించి, నిండు మనసుతో ఆశీర్వదించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని, ఇకపై తన ప్రయాణాన్ని ప్రజాసేవలో గడిపి ప్రజా ప్రయోజనాలకే అంకితమౌతానని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. తనకు పార్టీ టికెట్‌ ఇచ్చి అంతటి ఘన విజయానికి కారకులైన శత్రుచర్ల విజయరామరాజు, వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌కు, నియోజకవర్గంలోని ప్రతి మూడు పార్టీలకు చెందిన నాయకులకు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని ఆమె తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం శుక్రవారం టిడిపి నాయకలు డొంకాడ రామకృష్ణ, పల్ల రాంబాబుల ఆధ్వర్యంలో కుదమ పంచాయతీలో ఊరేగింపు చేపట్టారు. పంచాతీలో గల చినకుదమ, గౌరీపురం, పెదకుదమ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించి అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైన్లు, సాగునీరు, ఇంటింటి కుళాయి, పెదకుదమలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఇలా అనేక సమస్యలున్నాయని, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజాసంక్షేమానికి రేపు జరగబోవు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇందుకు ఎంఎల్‌ఎ సానుకూలంగా స్పందించి తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇచ్చి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆమె అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రైతులకు ఉద్యాన వనాలపై అవగాహన అవసరంప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురంరైతులకు ఉద్యాన వన వ్యవసాయాలపై అవగాహన ఉంటే ఆర్థికంగా బలోపేతం పొందేందుకు అవకాశం ఉంటుందని రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఉపాధి చట్టం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 2024-25 హార్టికల్చర్‌ లబ్ధిదారులకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఉద్యానశాఖపై అవగాహన నిర్వహిస్తున్నామని, ఈ మేరకు రైతులు వీటిని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే పంటలపై దృష్టి పెడితే బాగుంటుందన్నారు. సదస్సుకు వంగర, కేదారిపురం, నాండ్రుకోన, రెల్ల, డుమ్మంగి, కుక్కిడి పెదఖర్జా, తాడికొండ, ఇరిడి, లుంబేసు గ్రామపంచాయతీలకు సంబంధించిన లబ్ధిదారులు పాల్గొన్నారు. ఉపాధి హామీ ద్వారా కూడా పలు రకాల లాభదాయక పనులు చేపడుతున్నామని, ఈ మేరకు రైతులు కూడా లాభదాయ కమైన మొక్కలను పెంచుకుంటే ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని అన్నారు.

➡️