అశోక్‌రెడ్డి సమక్షంలో టిడిపిలో చేరిక

ప్రజాశక్తి – కొమరోలు : కొమరోలు మండలానికి చెందిన బండి వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులు శనివారం టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా టిడిపి కూటమి గిద్దలూరు నియోజక వర్గ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. .కంభంలో..ప్రజావక్తి-కంభంరూరల్‌ మండల పరిధిలోని కందులాపురం మాజీ వార్డు మెంబరు శ్రీనివాసులు, ఔరంగాబాద్‌ పంచాయతీలోని నడింపల్లె గ్రామానికి చెందిన కైరంకొండ రంగసాయి, రావిపాడు గ్రామానికి చెందిన శ్రీరాములు, కలగట్ల జయరాములు, సయ్యద్‌ బాషా, వీరిశెట్టి వెంకట సుబ్బయ్య శనివారం టిడిపిలో చేరారు. టిడిపి కూటమి గిద్దలూరు నియోజక వర్గ అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లో అశోక్‌రెడ్డి పర్యటన ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి వ్యవసాయాన్ని దండుగ చేశారని టిడిపి కూటమి గిద్దలూరు నియోజక అభ్యర్థి ముత్తుముల అశోక్‌ రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని లింగోజీపల్లె, తెల్లదిన్నే, ఎల్‌. కోట, ఔరంగాబాద్‌, నడింపల్లె, సైదాపురం, కందులాపురం, సూరేపల్లె, రావిపాడు, జంగంగుంట్ల, కాగితాల గూడెం, హాజరత్‌ గూడెం,దర్గా, దేవనగరం, పెద్దనల్లకాల్వ, చిన్న నల్లకాల్వ, లింగాపురం, ఎర్రబాలెం గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించాడు. ఈ సందర్భంగా ప్రజలను కలిసి టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించారు. వైసిపి వైఫల్యాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్‌ఛార్జి బెల్లంకొండ సాయిబాబు, టిడిపి, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

➡️