సూపర్‌సిక్స్‌తో ప్రజలకు న్యాయం: బేబినాయన

May 2,2024 21:04

ప్రజాశక్తి-రామభద్రపురం : సూపర్‌సిక్స్‌ పథకాలతో ప్రజలకు న్యాయం జరుగుతుందని టిడిపి బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. మండలంలో ఇట్లమామిడిపల్లి, సోంపురం, చింతలవలస, మర్రివలస గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని జగన్‌ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా రాష్ట్రాన్ని లూటీ చేశారన్నారు. ఇట్లమామిడిపల్లి గ్రామా నికి చెందిన కొన్ని కుటుంబాలు ఈ సందర్భంగా టిడిపిలో చేరాయి. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు, టిడిపి నాయకులు చింతల రామకృష్ణ, మడక తిరుపతిరావు, కరణం విజయభాస్కర్‌, కనిమెరక శంకరరావు, భవిరెడ్డి చంద్ర, ముల్లు రాంబాబు, గంట సాయికుమార్‌, గొర్లె రామారావు, దేవర తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు గ్రామాల్లో టిడిపి ప్రచారంగజపతినగరం: మండలంలోని పాతబగ్గాం, సాలిపేట, కొణిశ గ్రామాల్లో టిడిపి గజపతినగరం ఎమ్మెల్యే అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీరంరెడ్డి కుమార్‌, మాజీ సర్పంచ్‌ పెద్దింటి వెంకటరమణ, మాజీ ఎంపిటిసి మడక కన్నం నాయుడు ఆధ్వర్యంలో 150 కుటుంబాలు వైసిపిని వీడి, టిడిపిలో చేరాయి. ఈ సందర్భంగా కొండపల్లి మాట్లాడుతూ టిడిపితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు అట్టాడ లక్ష్మునాయుడు, మాజీ జెడ్‌పిటిసి మక్కువ శ్రీధర్‌, మాజీ ఎంపిపి శ్రీదేవి, నాయకులు గోపాల్‌రాజు, కుమార్‌, జనసేన నాయకులు మర్రాపు సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.టిడిపిలో పలువురు చేరికడెంకాడ: మండలంలోని చొల్లంగిపేట పంచాయతీ గువ్వుపేట గ్రామానికి చెందిన 15 వైసిపి కుటుంబాలు గురువారం టిడిపిలో చేరాయి. మాజీ ఎంపిపి కంది చంద్రశేఖర్‌ రావు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్‌పిటిసి పతివాడ అప్పలనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు పల్లె భాస్కర్‌ రావు, నాయకులు కలిదిండి పాణీరాజు, జగదీష్‌ రాజు, కలిదిండి రంగరాజు, బగ్గ రామారావు, మహంతి శ్రీను, తొత్తిడి సూరిబాబు, యడ్ల సూరిబాబు, రమేష్‌ రాజు, పెనుమత్స వర్మరాజు, జనసేన నాయకులు రమేష్‌, వేమారెడ్డి, పైల శ్రీను, బిజెపి అధ్యక్షులు కొరాడ రామకృష్ణ, బొంతు కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

➡️