న్యాయం గెలిచిందంటూ … టిడిపి నాయకుల హర్షం

Jan 15,2024 09:11 #joy, #justice, #TDP leaders, #won

ప్రజాశక్తి-మద్దికేర (కర్నూలు) : న్యాయం గెలిచిందంటూ … సోమవారం ఉదయం మద్దికెర మండల కేంద్రం టిడిపి ఆఫీస్‌ వద్ద టిడిపి నాయకులు మాజీ జెడ్పిటిసి రాజన్న యాదవ్‌ పట్టణ అధ్యక్షులు గడ్డం రామాంజనేయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … 2017 లో జరిగిన చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో కేఈ శ్యాం బాబుకు సంబంధం లేకున్నా పేరు చేర్చారని అన్నారు. జిల్లా కోర్టు విచారణ చేయగా ఈ కేసులో శ్యామ్‌ బాబుకు సంబంధం లేదని జిల్లా కోర్టు కొట్టు వేసి క్లీన్‌ షీట్‌ ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️