ఛత్తీస్‌గఢ్‌ జట్టుపె ‘ఆంధ్ర’ విజయం

ప్రజాశక్తి – కడప సి కె నాయుడు ట్రోఫీలో భాగంగా కడపలోని రాజారెడ్డి ఎసిఎ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌గఢ్‌ జట్టుపై 9 వికెట్ల తేడాతో ఆంధ్ర జట్టు ఘన విజయం సాధించింది. ఆంధ్ర బౌలర్లు టి. విజరు, వై. వాసు బౌలింగ్‌లో విజంభించి జట్టు గెలుపు కోసం దోహదపడ్డారు. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఛత్తీస్‌గఢ్‌ జట్టు 152 పరుగులు చేసింది. 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండవ రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆంధ్ర జట్టు 55.3 ఓవర్లలో 239 పరుగులకు ఆల్‌ అవుట్‌ అయింది. ఆంధ్ర జట్టులోని ధరణి కుమార్‌ నాయుడు 88, వై. వాసు 52 పరుగులు చేశారు.ఛత్తీస్‌గఢ్‌ జట్టులోని దీపక్‌ యాదవ్‌ అద్భుతంగా బౌలింగ్‌ ప్రదర్శించి 7 వికెట్లు తీసుకున్నాడు. 19 ఓవర్లు బౌలింగ్‌ వేసి అందులో 3 ఓవర్లు మేడిన్‌ వేసి 77 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్‌ సింగ్‌ 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఆంధ్ర జట్టు ఛత్తీస్‌గఢ్‌ జట్టుకు ఫాలో ఆన్‌ ఇచ్చింది. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఛత్తీస్‌గఢ్‌్‌ జట్టు 23.0 ఓవర్లలో 99 పరుగులకు ఆల్‌ అవుట్‌ అయింది. ఆ జట్టులోని ఆయుష్‌ పాండే 26 పరుగులు చేశాడు. ఆంధ్ర జట్టుకు చెందిన వై. వాసు అద్భుతంగా బౌలింగ్‌ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. 10.0 ఓవర్లు బౌలింగ్‌ వేసి అందులో ఒక ఓవర్‌ మేడిన్‌ వేసి 43 పరుగులు ఇచ్చి వికెట్లు తీసుకున్నాడు. మరో బౌలర్‌ టి. విజరు 11.0 ఓవర్లు బౌలింగ్‌ వేసి అందులో ఒక ఓవర్‌ మీటింగ్‌ వేసి 46 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో 13 పరుగుల విజయ లక్ష్యాన్ని చత్తీస్గడ్‌ జట్టు ఆంధ్ర జట్టు ముందు ఉంచింది. 13 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర జట్టు 2.2 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 13 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నాలుగు రోజులపాటు జరగాల్సిన ఈ మ్యాచ్‌ ఒకటిన్నర రోజుకే ముగియడం విశేషం.తలపడుతున్న ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్‌ జట్లు.

➡️