ఫిర్యాదుదారులకు నాణ్యమైన పరిష్కారం అందాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి – కడప
‘స్పందన’, ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాల ద్వారా అందే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ వి విజరు రామరాజుతోపాటు జెసి జి.గణేష్‌ కుమార్‌, డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూష హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిర్యాదులకు అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారులకు సంతప్తి చెందేలా నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారాలను అందించాలని చెప్పారు. అనంతరం ప్రజల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో సిపిఒ వెంకటరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ మహేశ్వర్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ శ్రీనివాసరెడ్డి, డిఆర్‌డిఎ పీడీ ఆనంద్‌ నాయక్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఇ వీరన్న, జిల్లా వ్యవసాయ అధికారి జెడి నాగేశ్వరరావు, హౌసింగ్‌, డ్వామా పీడీ కష్ణయ్య, యదుభూషన్‌ రెడ్డి, డిఎం హెచ్‌ఒ డాక్టర్‌ నాగరాజు, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి, ఎల్‌డిఎం దుర్గా ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ( ఫొటో:- స్పందన కార్యక్రమంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ విజరు రామరాజు)

➡️