మునక ప్రాంత వాసులకు పట్టాలు ఇవ్వాలి : సిపిఎం

గోపవరం : బద్వేల్‌ నియోజకవర్గంలోని అట్లూరు. గోపవరం మండలాల్లోని సోమశిల మునక ప్రాంత వాసులకు ఇంటి స్థలాలు, భూములు ఇవ్వాలని బద్వేల్‌ రూరల్‌ సిపిఎం మండల కార్యదర్శి డి. వెంకటేశ్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం అట్లూరు క్రాస్‌ రోడ్డు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అట్లూరు మండలంలోని ఎస్‌. వెంకటాపురం, రంగంపల్లె, చలం గారి పల్లె, ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు చెందిన మునక ప్రాంత వాసులకు ఇంటి స్థలాలు. భూములు ఇవ్వాలన్నారు. గతంలో రంగం పల్లెకు చెందిన సుమారు 80 మంది దళితులకు సర్వే నంబర్‌ 1779 లో డికెటి పట్టాలు ఇచ్చారని, కొందరు కలెక్టర్‌ అనుమతి లేకుండామూడు సెంట్లు స్థలాన్ని రెండు సెంట్లు మార్చుకొని దొంగ అనుబంధ పారాలను సష్టించుకుని కబ్జా చేశారని వాపోయారు. గోపవరం మండలం మునక ప్రాంతవాసులకు సర్వే నెంబర్‌ 1663, 1662 లలో పిపి కుంట వద్ద ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా మని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు జయరాజు, రాంబాబు, ఓబులేష్‌, అట్లూరు మండలం నాయకులు లక్ష్మీదేవి, అంజనమ్మ, సుబ్బమ్మ, గోపవరం మండలం సిపిఎం సీనియర్‌ నాయకులు కదిరయ్య, నరసింహులు, నరసయ్య పాల్గొన్నారు.

➡️